Andhra Pradesh : ఏపీలో బీచ్ ఫెస్టివల్. ఎక్కడో తెలుసా?

సాధారణంగా అభివృద్ధి చెందిన గోవా, ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఈ బీచ్ ఫెస్టివల్స్ గురించి వింటూ ఉంటాము. బీచ్ ఫెస్టివల్స్ ను యువత బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఈ బీచ్ ఫెస్టివల్ వైబ్ ను ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చింది.

Read Also : New Party in Telangana : తెలంగాణలో కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న

ఈ నెల 26 నుండి బాపట్ల జిల్లాలోని సూర్య లంకలో ఈ బీచ్ ఫెస్టివల్ జరగనుంది. 26 నుండీ 28 వరకూ మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలో అనేక రకాల అడ్వెంచర్ గేమ్స్ ను నిర్వహించనున్నారు. అలాగే ఎగ్జిబిషన్, లేజర్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి. ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తూ ఉన్నారు.

Read Also : Official : మన హీరోయిన్ల రెమ్యునరేషన్లు చూస్తే షాక్ అవుతారు

ఇక 27వ తరీకున సీఎం చంద్రబాబు బీచ్ ను సందర్శించనున్నారు. రూ. 97 కోట్లతో జరగనున్న అనేక అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేయనున్నారు. ఇక ఈ ఫెస్టివల్ లో పాల్గొనాలనుకుంటే మీరుకూడా సూర్యలంక చేరుకొండి. బాపట్లనుండి కేవలం 9 కి.మీల దూరంలో సూర్యలంక సముద్ర తీరం దర్శనమిస్తుంది.