ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగివున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనికి వరల్డ్ వైడ్ ఎంతో ఆదరణ ఉంది. మనదేశంలో కూడా అత్యధిక యూజర్లు వాట్సాప్ నే వినియోగిస్తుంటారు. టెలిగ్రామ్, సిగ్నల్, హైక్ వంటి అనేక మెసేజింగ్ యాప్స్ వచ్చినా అవేమీ వాట్సాప్ మార్కెట్ ను కనీసం టచ్ చేయలేకపోయాయ్. అయితే దేశీయ ఐటీ సంస్థ జోహో తాజాగా అభివృద్ధి చేసిన మెసేజింగ్ యాప్ అరట్టై వాట్సాప్ కు చెమటలు పట్టిస్తోంది. మేడిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ అరట్టైను ఉపయోగించాల్సిందిగా పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు, వివిధ కంపెనీల సీఈవోలు ప్రచారం చేస్తుండడంతో ఈ యాప్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది.
Read Also : BREAKING : తెలంగాణ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు
గత శుక్రవారానికి (అక్టోబర్ 3, 2025) ఈ యాప్‌ను 75 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని జోహా కంపెనీ అధినేత శ్రీధర్ వెంబు ధ్రువీకరించారు. ఒక దేశీయ యాప్ ఇంత వేగంగా ఈ స్థాయిలో డౌన్ లోడ్లను సొంతం చేసుకోవడం, ఇంత ఆదరణ పొందడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.
Read Also : శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలో తెలుసా? మనం తప్పుగా చేస్తున్నాం..
అరట్టై’ యాప్ వాట్సాప్ కంటే ఎందుకు ప్రత్యేకం? :
1. పాకెట్ క్లౌడ్ స్టోరేజ్: సాధారణంగా వాట్సాప్ లో వినియోగదారులు ముఖ్యమైన మెసేజ్‌లను సేవ్ చేసుకోవడానికి తమ నంబర్ కే స్వయంగా మెసేజ్ లు పంపుకుంటారు. కానీ, అరట్టైలోని పాకెట్ స్టోరేజ్ ఫీచర్ దీనికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు అవసరమైన మెసేజ్‌లు, మీడియా ఫైళ్లు మరియు నోట్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. ప్రతి యూజర్ కు 2జీబీ క్లూడ్ స్టోరేజ్ ను అందిస్తున్నారు.
2. నో AI చాట్ బాట్ : వివిధ ప్లాట్‌ఫారమ్ లలో ఇప్పుడు AI చాట్‌బాట్‌లు ఉండటం మనం చూస్తున్నాం. అయినప్పటికీ, వినియోగదారుడి అవసరం కంటే ఎక్కువగా ఈ చాట్‌బాట్ లను బలవంతంగా రుద్దుతున్నారనే భావన ఉంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతానికి అరట్టై AI బాట్లను అలౌ చేయట్లేదు.
3. మీటింగ్స్ ఆప్షన్ : ముఖ్యంగా ఇందులో ఉన్న మీటింగ్స్ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది. దీని ద్వారా వినియోగదారులు నేరుగా అరట్టై యాప్ ద్వారానే మీటింగులను క్రియేట్ చేయవచ్చు, ఇతర వినియోగదారులు క్రియేట్ చేసిన మీటింగ్ లలో జాయిన్ కావచ్చు. వాటిని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు.
4. మెన్షన్స్ ట్యాబ్ : ఇందులో మెన్షన్స్ ట్యాబ్ ఫీచర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దీని ద్వారా మనల్ని ఏదన్నా చాట్ లో లేదా గ్రూప్ లో మెన్షన్ చేసి పెట్టిన సందేశాలను వేరే స్పెషల్ ట్యాబ్ లో చూడచ్చు. దీనితో ముఖ్యమైన వాటిని మిస్ కాము.
5. డేటా సెక్యూరిటీ : వినియోగదారుల డేటా మొత్తం భారతదేశంలో ఉన్న డేటా సెంటర్లలో నిల్వ చేయబడుతుందని జోహో తెలిపింది. సో విదేశీ స్కామర్ల చేతుల్లోకి మన డేటా పోదు.
6. గ్రూప్ చాట్ సామర్థ్యం : అరట్టై మెసెంజర్‌లో గ్రూప్ చాట్ సామర్థ్యం ఎక్స్టెండ్ చెయ్యబడింది. గరిష్టంగా వెయ్యి మంది వినియోగదారులు ఒక గ్రూప్‌లో చేరవచ్చు.
Read Also : పహల్గామ్ దాడికి సహకరించిన వ్యక్తి అరెస్ట్.. ఒక మొబైల్ ఛార్జర్ వల్ల దొరికేశాడు
సో మన అరట్టై, వరల్డ్ నెంబర్ వన్ యాప్ కు గట్టిపోటీ ఇస్తోందన్నమాట. కానీ ఒక్క విషయంలోనే యూజర్లు ప్లే స్టార్, యాప్ స్టర్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే యాప్ నేమ్. అరట్టై అంత అనుకూలంగా లేదని, తమిళ్ పెరు పెట్టుకోవడం ఆ రాష్ట్రం వారైన మీకు సంతోషమే! కదనడం లేదు కానీ ఇంటర్నేషల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని పేరుపై పునరాలోచించాలని అంటున్నారు.
