ఖచ్చితత్వం, సమగ్రతతో కూడిన ఆయుర్వేద చికిత్స అందించేందుకు అపోలో AyurVAID హాస్పిటల్స్ తెలంగాణలోకి ప్రవేశించింది. భారతదేశంలోనే అతిపెద్ద రికవరీ హాస్పిటల్స్ చైన్ అయిన HCAH సువిటాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ తొలి “AyurVAID HCAH సెంటర్ ఫర్ ప్రెసిషన్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్” ను ప్రారంభించినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ కేంద్రం ముఖ్యంగా ఇంటిగ్రేటివ్ న్యూరో రిహాబిలిటేటివ్ కేర్లో నిపుణత చూపిస్తుంది. సంక్లిష్ట, దీర్ఘకాలిక, క్షీణించిన అనారోగ్యాలతో బాధపడే రోగులకు సమగ్ర రీహాబిలిటేషన్, రికవరీ సేవలు అందిస్తుంది.
Also Read : ఓట్ చోరీపై సుప్రీంలో పిల్. ఏం జరిగిందంటే…
అందించే ప్రత్యేక సేవలు
మల్టీడిసిప్లినరీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా రూపుదిద్దుకున్న ఈ కేంద్రం ఈ కింది సమస్యలపై దృష్టి పెడుతుంది:
నాడీ సంబంధిత రుగ్మతలు: తీవ్రమైన మెదడు గాయాలు, స్ట్రోక్, మోటార్-న్యూరాన్ వ్యాధులు.
ఎముకల సంబంధిత రుగ్మతలు: మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం రీహాబిలిటేషన్.
దీర్ఘకాలిక సమస్యలు: గుండె, శ్వాసకోశ, మూత్రపిండాల పనితీరు తగ్గడం, నయంకాని గాయాలు, బెడ్-సోర్లు.
ప్రత్యేక విభాగాలు: పిల్లలలో ఎదుగుదల లోపాలు, వృద్ధాప్య సంరక్షణ.
Also Read : AI : ఏఐ వల్ల త్వరలో మనకు “కరెంట్ షాక్” తగలనుందా?
ఇక్కడ జీవక్రియ, ఆర్థో-న్యూరో, గైనకాలజీ, శ్వాసకోశ, మానసిక ఆరోగ్యం లాంటి అన్ని ప్రధాన వైద్య విభాగాలకు ఆయుర్వేద చికిత్సలు లభిస్తాయి. పైల్స్, ఫిస్టులా లాంటి అనోరెక్టల్ సమస్యలు, డయాబెటిక్ ఫుట్ లాంటి నయంకాని గాయాలకు ప్రత్యేక ఆయుర్వేద పారా-సర్జికల్ ప్రక్రియలు సైతం అందుబాటులో ఉన్నాయి.
కేంద్రం ముఖ్యాంశాలు:
పడకల సామర్థ్యం: సమగ్ర రీహాబిలిటేషన్ సేవలకు మొత్తం 115 పడకలు. ఇందులో ఆయుర్వేద చికిత్సల కోసం ప్రత్యేకంగా 20 పడకలు కేటాయించారు.
వైద్య విధానం: అనారోగ్య మూల కారణాలను గుర్తించి, సమగ్ర చికిత్స అందించే హోల్ పర్సన్ కేర్ (Whole Person Care) విధానానికి అపోలో AyurVAID ప్రాధాన్యత ఇస్తుంది.
