టీచర్లకు టెట్.. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?

గత జగన్ ప్రభుత్వంలో టీచర్లను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి, ఇప్పుడు ఆ టీచర్లకు సంబంధించిన టెట్ వ్యవహారం తలనొప్పిగా మారింది. 2011 సంవత్సరానికి ముందు ఈ టెట్ వ్యవహారం లేదు. ఉపాధ్యాయులలో నిపుణతను, సామర్థ్యాన్ని పెంచటానికి తర్వాఠీ రోజుల్లో టెట్ ను రంగంలోకి తీసుకొచ్చింది ఉన్నత విద్యా మండలి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ టెట్ ను ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : భారత మహిళల జట్టు ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు చేరాలంటే?

ఇక వివరాల్లోకెళ్తే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఆ ఉద్యోగంలో కొనసాగాలన్న లేదా పదోన్నతులు పొందాలన్నా రెండేళ్లలో టెట్ తప్పనిసరిగా పాస్ అయి తీరాలని గత సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనితో ఇప్పుడు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : Pooja Hegde : అందాల పాలపుంత పూజా హెగ్డే

మరోవైపు ఈ విధంగా టెట్ నిర్వహించి పదోన్నతులు కల్పించడం లేదా ఉద్యోగం నుంచి తీసివేయడం వంటి కార్యక్రమాల పట్ల ఉపాధ్యాయ సంఘాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ పద్ధతి ఉపాధ్యాయులను అయోమయానికి, ఆత్మ న్యూనత భావానికి గురి చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీనిపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. ఉపాధ్యాయులకు వ్యతిరేకం కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా చివరికంటా పోరాడమనే భావన ఉపాధ్యాయుల్లో కలుగుతుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.