అమెరికా అధ్యక్షుడిగా ట్రూప్ ఎన్నిక అయినప్పటి నుండీ ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రాంపంచానికే కాదు ఆదేశ ప్రజలకు సైతం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. దానితో ప్రజలు ఒక్కసారిగా ఉద్యమబాట పట్టారు. అమెరికాలోని అన్ని ప్రముఖ నగరాల్లో ప్రజలు రోడ్లనీడకు లక్షలాదిగా వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు. “నో కింగ్స్” పేరుతో ఈ ర్యాలీలు జరుపుతున్నారు అమెరికన్ ప్రజలు. ట్రంప్ ఓ చక్రవర్తిలా వ్యవహిస్తూ ఏకపక్ష నిర్ణయాలతో అమెరికాను నాశనం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Read Also : OG : పవర్ స్టార్ ఓజీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ముఖ్యంగా ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ అంశాలలో ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలతో అమెరికన్ ప్రజలు విసిగిపోయినట్లు సమాచారం. ఈ అనాలోచిత, ఏకపక్ష పాలసీలు వల్ల దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు లాగా జీవితం గడుస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఎడ్యుకేషన్ కోసం, ఉద్యోగాల కోసం వచ్చిన వారుకూడా ఇబ్బందికర పరిస్థితులు రోజూ ఎదుర్కోవడం దారుణమని అంటున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగోతో సహా అన్ని ప్రముఖ నగరాల్లో ప్రజలు నో కింగ్స్ బ్యానర్లు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు.
Also Read : Analysis : రాజ్యాధికారం ఇస్తామనిచెప్పి బీసీలను మళ్ళీ రోడ్డెక్కించారు. ఈ తప్పెవరిది?
అంతేకాకుండా డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అయితే ట్రంప్ నిర్ణయాలు మరీ దారుణంగా ఉంటున్నాయని అంటున్నారు. కాక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని డెమోక్రాట్ల ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటె ట్రంప్ ఈ విషయమై ఫాక్స్ టీవీతో మొదటిసారిగా మాట్లాడుతూ “నన్ను అందరూ చక్రవర్తిగా సంబోధిస్తున్నారు, కానీ నేను చక్రవర్తికి కాదు” అన్నారు. ఈ నిరసనలను రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవి కేవలం అమెరికాకు వ్యతిరేకంగా నడుచుకునే వారి కుట్రేనని అంటున్నారు. అమెరికాలోని 2500 నగరాలతోపాటు యూరప్ లోని యూఎస్ ఎంబసీల వద్దకుడా నిరసనలు జరుగుతున్నాయి. దీనితో దాదాపు అన్ని రాష్ట్రాలు హై ఎలర్ట్ లో ఉన్నాయి. నేషనల్ గర్డ్స్ ను డిప్లాయ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు గవర్నర్లు. ట్రంప్ విదేశాలమీద దృష్టిపెట్టడం కంటే ముందు సొంత దేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని అమెరికన్లు తెగేసి చెప్తున్నారు.
