అనుష్క దారిలో ఐశ్వర్య. అసలు ఏమౌతోంది?

మన సెలెబ్రెటీలను సోషల్ మీడియాలో చాలా మంది ఫాలో అవుతుంటారు. వాళ్ళకి సంబందించిన విషయాలను, వారి కెరీర్ తాలూకూ అంశాలను తెలుసుకునేందుకు బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దానితో చాలా మంది సెలెబ్రెటీలు వారిని వారు డెమీగాడ్స్ లాగా భవిస్తూ ఒక జోన్లోకి వెళ్లిపోతుంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ నైజం చాలా ఒత్తిడికి గురిచేస్తుంటుంది.

Read Also : రాజధానిపై వైసీపీ స్టాండ్ మార్చిందా? సజ్జల మాటల్లో ఆంతర్యం ఏంటి?

అలాంటి సందర్భాలను హ్యాండిల్ చెయ్యడం ఎలా అనే దానిమీద ఒక్కో సెలెబ్రిటీ ఒక్కో స్టైల్ ఫాలో అవుతుంటారు. ఈ మధ్యనే లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తను కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాకు దూరమౌతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also :India vs Pak : ఇండియా పాక్ మ్యాచ్ కు ఇంకా అమ్ముడుపోని టికెట్లు కారణం ఇదేనా?

ఇప్పుడు ఇదే బాటలో యాక్టరస్ ఐశ్వర్య లక్ష్మీ కూడా నడుస్తున్నారు. సోషల్ మీడియాకు పూర్తిగా దూరమౌతున్నట్లు ఆమె ప్రకటించారు. సోషల్ మీడియాకు బానిసగా మారడాన్ని తట్టుకోలేక పోతున్నానని, ఇది నన్ను మరింత కుంగదీస్తుందని ఆమె అన్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఉంటేనే మనకు అవకాశాలు వస్తాయని, ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఉంటేనే గుర్తు పెట్టుకుంటారని భావించానని తెలిపారు. కానీ అది నిజం కాదని ఇప్పుడు అనిపిస్తోందని అన్నారు. నేను మంచి సినిమా చేసినప్పుడు నన్ను ఇదివరకటిలా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.