నటుడు మోహన్ బాబుకు షాక్. కావాలనే టార్గెట్ చేసారా?

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుకు పద్ద షాక్‌ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న మోహాన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని AP ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. కొన్ని రోజుల క్రితం చివరి మూడు సంవత్సరాలలో విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసారని ఆరోపణలు వచ్చాయి.

Read Also :ప్రధాని నరేంద్ర మోదీకి కంగ్రాట్స్ చెప్పిన జగన్. ఈ బంధం ఇంకా బలంగానే ఉందా?

దీనితో విచారణ కమీషన్ ను నియమించిన ఉన్నత విద్యా కమిషన్. ఆరోపణలు నిజమేనని తేల్చింది. రూ. 26 కోట్లకు పైగా అదనంగా వసూలు చేసారని దృవీకరించింది. ఈ క్రమంలో యూనివర్సిటీకి రూ. 15 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతటితో ఆగని విధ్యా కమీషన్ యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Read Also : ఈ రెండు రోజులు ట్రంప్ కు నిద్ర పట్టదేమో! ఏమైపోతాడో పాపం…

అయితే ఏపీలో కేవలం మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీ మాత్రమే కాకుండా, ఏపీ మంత్రి నారాయణతో సహా బాలకృష్ణ చిన్నల్లుడు భారత్ కు చెందిన గీతం యూనివర్సిటీ వంటి అనేక సంస్థలలో ఫీజులు, ఇతర సదుపాయలకు సంభందించి నిబంధనల ఉల్లంఘినలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఐనప్పటికీ ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి సంబందించిన వారు ఏం చేసినా పట్టించుకోని ఉన్నత విద్యా మండలి కేవలం మోహన్ బాబుని టార్గెట్ చెయ్యడం ఏంటని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Read Also :ఓ వ్యక్తి దగ్గర 1638 క్రెడిట్ కార్డులు ఉన్నాయంటే నమ్ముతారా? గిన్నీస్ రికార్డ్ సాధించిన భారతీయుడు..

గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫీజు రీయంబర్సుమెంట్ విషయంలో ధర్నా చెయ్యడం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని టార్గెట్ చెయ్యడం, వైసీపీ అధినేత జగన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం వంటి కరణాలతోనే ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలను టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం దాడులు నిర్వహించిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.