ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, ఎర్రమల్లె గ్రామానికి చెందిన శ్రీ చరణి భారత మహిళల జట్టులో కీలకంగా మారింది. వన్డే వరల్డ్ కప్ లోని ఫైనల్ మ్యాచ్ తో పాటు అనేక మ్యాచుల్లో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చారని పెరు మార్మోగుతోంది.
మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినప్పటికీ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో చరిత్ర సృష్టించిండి శ్రీ చరణి. పేదరికం, కష్టాలు. అన్నిటినీ ఎదురించి దేశానికే గర్వకారణంగా మారింది. ఐసీసీ మహిళల విభాగంలో భారత్‌కు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించి తెలుగు వారి సత్తా చాటిన శ్రీ చరణి, ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్ లో ప్రపంచ కప్ లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచి చరిత్ర సృష్టించింది.
Also Read : BREAKING NEWS : ఇరగదీసిన ఆడ పులులు.. విశ్వ విజేతగా భారత జట్టు
నిజానికి క్రికెట్ ఆమె మొదటి స్పోర్ట్ కాదు. చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి ఆటల్లో పాల్గొంది. అయితే, 16 ఏళ్ల వయసులో ఆమె క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఈ నిర్ణయానికి ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన కారణం చెప్పింది ఈ ఛాంపియన్
ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ టీమ్ గా అడే క్రీడ కావడంతో ఆమె తండ్రి మొదట్లో అంత ఇంట్రెస్ట్ చూపలేదు. తండ్రిని ఒప్పించడానికి ఆమెకు ఏడాది కాలం పట్టింది. చరణి చెప్పిన ప్రకారం ఆమె క్రీడా జీవితాన్ని ప్రారంభించే సమయంలో తన కుటుంబం అప్పులతో బాధపడేది. అయినప్పటికీ, ఆ కష్టాలు తన ఆటపై ప్రభావం చూపకుండా ఆమె తల్లిదండ్రులు సహకరించారు.
Also Read :WWC : ఇండియా దెబ్బ.. ఆస్ట్రేలియా అబ్బా.. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్
క్రీడా జీవితం ప్రారంభంలో శ్రీ చరణి మొదట ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్‌లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బొటర్ గా ప్రయత్నించగా వర్క్ ఔట్ అవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా మారింది. కడప లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. జాతీయ జట్టుకు ఎంపిక కావడం, ప్రపంచ కప్ కూ ఎన్నికవడం అలా జరిగిపోయాయి. కష్టపడి సాధించిన ఈ విజయాన్ని చూసి తల్లిదండ్రులు ఈరోజు గర్వపడుతున్నారు. “నీకు పేరు తీసుకొస్తానమ్మా.. అని ఎప్పుడు చెప్పేదని, ఇప్పుడు తనని చూసి గర్వపడుతున్నాను” అని చెప్తూ ఆమె తల్లి మురిసిపోయారు
