అసాధ్యం సుసాధ్యమయ్యింది. 2025 మహిళల ప్రపంచకప్ ఫైనల్ లో భారత జట్టు అద్భుత విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. మెన్స్ టీమ్ కు ఆఖరి మెట్టుపై చేజారిన అదే వన్డే వరల్డ్ కప్ ను తాము తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేసి అనుకున్నట్టుగానే కప్ ను ఒడిసి పట్టింది హర్మన్ సేన.
ప్రతికా గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షిఫాలీ వర్మ ట్రంప్ కార్డ్ పాత్ర పోషించింది. అద్భుత బ్యాటింగ్ తో పాటు కీలక సమయంలో బౌలింగ్ లోనూ ఆదరగొట్టి ముఖ్యమైన 2 వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా చతికిల పడింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా సెంచరీతో పొరాడినా ఫలితం దక్కలేదు. చివరిలో డిక్లాక్ కొంత ఫాస్ట్ గా పరుగులు చేసినా అవి సౌత్ ఆఫ్రికా ఓటమిని అపలేకపోయాయి. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న దీప్తి శర్మ 5 వికెట్లు సైతం తీసి అల్ రౌండ్ ప్రతిభ కనబరిచింది. తెలుగమ్మాయి శ్రీ చరణి సైతం పిచ్ స్వభావానికి తగ్గట్లుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
అంతకుముందు టాస్ ఒడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వుమెన్ ఇన్ బ్లూ 50 ఓవర్లలో 298 పరుగులు చేసి 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రోటీయాస్ ముందు ఉంచింది. తొలి వికెట్ కు స్మృతి మందన్న, షిఫాలీ వర్మ 102 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి స్టార్ట్ ఇచ్చారు. తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్, జమీమా షాఫాలీ తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినా చివరిలో దీప్తి హాఫ్ సెంచరీ చేసి ఇండియాను మంచి పొజిషన్ లో నిలబెట్టింది. దీనితో 299 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచగా లక్ష్య చెదనలో ఆ టీమ్ చతికిల పడింది.
