చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది మన భారత మహిళల క్రికెట్ జట్టు. ఈరోజు (2 నవంబర్, ఆదివారం) నవీ ముంబై లోని DY పాటిల్ స్టేడియంలో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి ప్రపంచ విజేతగా నిలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు, ఇక ఎప్పుడు లేని విధంగా బీసీసీఐ నుండీ ప్రోత్సాహకాలు అందుకుంటున్న మహిళల జట్టు కప్ గెలిస్తే రికార్డు స్థాయి నగదు బహుమతి అందుకోనుంది.
Also Read : Sreeleela : బ్లాక్ శారీలో మత్తెక్కిస్తున్న శ్రీలీల
అందుతున్న సమాచారం ప్రకారం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని మహిళా జట్టుకు బీసీసీఐ గత సంవత్సరం పురుషుల టీ20 వరల్డ్ కప్ విజేతలకు ఇచ్చినంత విన్నింగ్ బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఈ కప్ కొడితే మన జట్టుకు 125 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇవ్వనుంది. ఇది ఖచ్చితంగా మహిళ క్రికెట్ కు ఆదరణను, ప్రోత్సాహాన్ని పెచేందుకు తోడ్పడనుంది. అంతకు ముందు జైషా నేతృత్వంలోని కంట్రోలింగ్ కమిటీ అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు సమాన మ్యాచ్ ఫీజును నిర్ణయించి, అమలు చేస్తున్న విషయం రెలిసిందే.
Also Read : తాగిన మత్తులో ఇన్ఫోసిస్ ఉద్యోగి వీరంగం.. గృహిణి తో అసభ్య ప్రవర్తన
ఇక ప్రపంచ కప్‌లో రెండు సార్లు ఫైనల్‌కు అర్హత సాధించినా నిరాశతో వెనుదిరిగిన మన జట్టు, ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తుది సమరంలో విజయం సాధించాలని ఆశిస్తోంది. స్మృతి మందన, జమీమా తోపాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా ఫామ్ లోకి రావడం మనకు కలిసొచ్చే అంశం. అటు టీమ్ లోకి రాధ యాదవ్ ను తీసుకోవాడం ద్వారా బౌలింగ్ ను కూడా బలోపేతం చేసుకోవడం ఆఖరి మ్యాచ్ లో కలిసొచ్చింది. లేకపోతే ఆసీస్ జట్టు 370 పరుగుల వరకూ వెళ్ళేది. అలాగే దీప్తి శర్మతోపాటు రిచా, అమన్ జోట్ సైతం పరుగులు రాబడుతున్నారు. దీనితో బేసిక్స్ కు కట్టుబడి ఆడితే ఈసారి మనం కప్ కొట్టడం ఖాయం. అల్ ది బెస్ట్ ఉమెన్ ఇన్ బ్లూ…
