కంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రిపదవి దక్కింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో అజహరుద్దీన్ కుమారుడు అసరుద్దీన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో అజహరుద్దీన్ ను ప్రమాణ శ్వీకారనికి సిద్ధంగా ఉండమని సీఎం చెప్పినట్లు సమాచారం.
Also Read : తాగిన మత్తులో ఇన్ఫోసిస్ ఉద్యోగి వీరంగం.. గృహిణి తో అసభ్య ప్రవర్తన
ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో అజహరుద్దీన్ కు మంత్రిపదవి వరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎల్లుండి అజహరుద్దీన్ ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుత మంత్రి వర్గంలో ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేకపోవడం అజర్ కు కలిసొచ్చిందని చెప్పొచ్చు.
Also Read : ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం. ఎక్కడంటే?
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున జూబ్లీహిల్స్ నుంచి అజహరుద్దీన్ ఎమ్యల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. కానీ అనూహ్యంగా అజర్ కు మంత్రి పదవి దక్కడం తో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
