బల్కంపేట్ లోని నేచర్ మైత్రి అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న ఓ గొడవలో గృహిణి తో అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 26న రాత్రి ఫ్లాట్ నెం. 502 నివాసిస్తున్న ఇన్ఫోసిస్లో టెక్ సపోర్ట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న శ్రీవరుణ్ బొమ్మినేని కారును అతివేగంగా నడిపి, అక్కడున్న వారిని వీడియో తీయడం మొదలుపెట్టారు. దీనిపై హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ మాదల శ్రీలత (36) భర్త అభ్యంతరం వ్యక్తం చేయగా, శ్రీవరుణ్ ఆయనతో గొడవకు దిగాడు.
Also Read : ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం. ఎక్కడంటే?
ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించిన శ్రీలతను, ఆమె అత్తను, కుమార్తెను కూడా ఉద్దేశిస్తూ శ్రీవరుణ్ అసభ్యకరమైన భాషలో దూషించి, బెదిరించాడని శ్రీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, శ్రీలత అక్టోబర్ 27న ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీవరుణ్పై ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ టి. శ్రీనాథ్ రెడ్డి, నిందితుడిపై క్రైమ్ నంబర్ 831/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును సబ్-ఇన్స్పెక్టర్ మధుసూధన్కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
