ALLERT : మోంథ తుఫాన్ ముప్పు ఇంకా పొంచే ఉంది.. జాగ్రత్త!

అర్ధరాత్రి ఒంటిగంట ప్రాతంలో మొంథ తుఫాన్ మచిలీపట్నం, అమలాపురం మధ్య, నరసపూర్ వద్ద తీరాన్ని దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ, తు.గో, పా.గో, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు అత్యంత భారీవర్షాలను చవి చూస్తున్నాయి.

Also Read : Cyclone Update : మోంథ తుఫాన్ భీభత్సం ఇవ్వళ్లే… చాలా జాగ్రత్త..

ఇక ఇంతటితో ఈ ముప్పు తొలగి పోలేదని, ఈ వర్ష భీభత్సం ఈరోజు కూడా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని మంత్రి లోకేష్ తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. రాత్రంతా RTGS కేంద్రంలోనే బస చేసిన ఆయన తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.

Also Reaad : కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్. ఇంకా ఆస్ట్రేలియాలోనే..

మరోవైపు ఇంకా తుఫాన్ ముప్పు అలానే పొంచి ఉందని, ఈటొజు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా విద్యాసంస్థలకు సెలవులు కొనసాగనున్నాయి. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, మన్యం, విశాఖ, కోనసీమ, తు.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు కూడా అన్ని విధ్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. ఇక కాకినాడ జిల్లాలో ఈ నెల 31 వరకూ సెలవులు కనసాగనున్నాయి.