LIVE : మోంథ తుఫాన్ అప్డేట్స్ లైవ్.. తాజా సమాచారం కోసం ఈ పోస్ట్ ఫాలో అవ్వండి

Updated at : 01:15AM, 29/10/2024

BIG BREAKING : తీరం దాటిన మోంథ తుఫాన్. మచిలీపట్నం – అమలాపురం మధ్య నరసాపూర్ దగ్గర తీరం దాటిన తుఫాన్

BREAKING : తీరాన్ని తాకిన తుఫాన్. పూర్తిగా తీరాన్ని దాటడానికి 3 నుండి 4 గంటలు పడుతుంది. మచిలీపట్నం కాకినాడ మధ్య 11 గంటల ప్రాంతంలో తీరం దాటొచ్చు 

ఏపీలో తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఈ రోజు సాయంత్రం 7 గంటలనుండీ జాతీయ రహదారులపై పెద్ద వాహనాలను నిషేధించారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణంలో ఉన్నవారు దగ్గరలోని లే బే వద్ద లేదా టోల్ ప్లాజాల వద్ద నిలిపివేయాలని అధికారులు సూచించారు.

IMPORTANT

కొంత వరకు తుఫాన్ దిశ మారిందని చెప్పొచ్చు. తీరం దాటే సమయంలో ముందు అనుకున్న కాకినాడ తోపాటు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ విషయాన్ని ఏపీ వ్యథర్ మ్యాన్ కన్ఫర్మ్ చేశారు. అమలాపురం, కాకినాడ మీదుగా తీరం దాటే అవకాశం ఉంది. 10పీఎం -&11పీఎం మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉంది.

తుఫాన్ ఎఫెక్ట్ లైవ్ అప్డేట్స్ :

* విశాఖ వద్ద కూడా సముద్రానికి అడ్డంగా పెట్టిన రాళ్లు ధ్వంసమయ్యాయి. అలల తాకిడికి రాళ్ళు రోడ్లపైకి కొట్టుకు వస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది

• BREAKING : ఉప్పాద – కాకినాడ బీచ్ రోడ్ ధ్వంసం. అలలు వల్ల రోడ్ల పైకి చేరుతున్న రాళ్లు.

• మచిలీపట్నంలో భారీ వర్షం. 500మీ. ముందుకు వచ్చిన సముద్రం

• గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో 72 పునరావాస కేంద్రాల ఏర్పాటు

• సోమశిల, రాళ్లపాడు, కుండలేరు రిజర్వాయర్లు ఫుల్

• నిజాంపట్నం హార్బర్ లో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

• విజయనగరం జిల్లాలో 69 ముంపు ఏరియాలను గుర్తించి 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.