MANTHA CYCLONE : దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్. ఏపీని ముంచెత్తనున్న అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడనున్న మంథ తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని కలవర పెడుతోంది. ఈ రోజు సాయాత్రం నుండీ దీని ప్రభావం కనబడనుంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న మంథ సాయంత్రానికి తుఫానుగా మారనుంది. మంగళవారం మధ్యాన్నం లేదా సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతానికి కాకినాడకు 880 కీ.మీల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మంగళవారం అడ్డారాత్రికి మచిలీపట్నం కళింగ పట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.

Also Read : WWC : మహిళల ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ తో తలపడే జట్టు అదే!

ఈ ప్రభావంతో ఈరోజు సాయంత్రం నుండీ వానలు ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. రేపు సాయంత్రం నుండీ  భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 28 నాటికి తీరం దాటే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కిరుస్తాయి. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు ఉదయం నుండి 2 రోజుల పాటు వర్షం తీవ్రత అధికంగా ఉండనుంది.

Also Read : ఈ రోజే నాగుల చవితి. నాగపూజకు సరైన సమయం ఎదో తెలుసా?

ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు సెలవులు ప్రకటించారు. 28, 29 తేదీల్లో తీర్పు గోదావరి, కడప జిల్లాలకి సెలవులు ఇవ్వగా, 27, 28, 29 తేదీలలో గుంటూరు, కృష్ణ, బాపట్ల, NTR జిల్లాలకు సెలవులు ప్రకటించారు. ఇక కోనసీమ జిల్లాల్లో అప్పటి వర్ష తీవ్రతను బట్టీ సెలవులు ఇవ్వనున్నారు. రాబోయే నాలుగు రోజులు ఇంటిలో నుండీ బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.