భారతదేశం వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే టాప్ ప్లేస్ లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లతో పాటు ఇంగ్లాండ్, ఇండియా జట్లు కూడా సెమీస్ కు చేరాయి. ఈ నెల 29, 30వ తేదీలలో సెమీఫైనల్ మ్యాచులు జరగనుండగా నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Also Read : ఈ రోజే నాగుల చవితి. నాగపూజకు సరైన సమయం ఎదో తెలుసా?
ఇక ఈరోజు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది ఉమెన్ ఇన్ గ్రీన్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా కేవలం 91 పరుగులు మాత్రమే చేసి అల్ ఔట్ అయింది. ఈ సునాయాస లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలోనే ఛేదించారు కంగారూలు. ఇక ఆసీస్ బౌలర్ అలానా కింగ్ 7 వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచింది. తర్వాత ఇక ఏ దశలోనూ SA జట్టు మ్యాచ్ పై పట్టు బిగించలేకపోయింది.
Also Read : Ananya Nagalla : అనన్య నాగళ్ల ఫోటో గ్యాలరీ
దీనితో ఏఏ జట్లు ఏఏ స్థానాల్లో నిలబడ్డాయి అనే అంశంపై క్లారిటీ వచ్చేసింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ ను ఖాయం చేసుకోగా, 26న జరగనున్న మ్యాచులో ఇండియా గెలిచినా 4వ స్థానానికే పరిమితం కానుంది. దీనితో సెమీస్ లో ఎవరితో ఎవరు పోటీ పడతారన్న విషయం తేలిపోయింది. అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీస్ లో ఇంగ్లాండ్ తో సౌత్ ఆఫ్రికా తలపడనుండగా ఇండియా జట్టు అక్టోబర్ 30న నవీ ముంబైలో జరిగే రెండవ సెమీఫైనల్ లో పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ గండం గట్టిక్కితే ప్రపంచకప్ సాధించాలన్న మన ఆశ నెరవేరే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తోంది.
