కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం (అక్టోబర్ 24) వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ఓ బైకును ఢీకొనడంతో దాని పెట్రోల్ ట్యాంక్ బస్సుకు రాసుకుని ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆతర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ద్వారాన్ని పగలగొట్టి బయటకొచ్చారు. దీనితో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
Read Also : ఇవ్వాళ్ళ భారత్ బంద్. ప్రభావం ఉంటుందా?
బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకూ 11 మృతదేహాలను బయటకు తీసామని కలెక్టర్ సిరి వెల్లడించారు. మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 21 మంది సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Also Read : ఏపీలో సర్పంచ్, పరిషత్ ఎన్నికలపై కీలక అప్డేట్
దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు దృష్టికి అధికారులు ఈ విషయాన్ని తీసుకు వెళ్లగా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ తో మాట్లాడిన ఆయన పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని, అన్ని రకాల ఉన్నతస్థాయి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇదిలా ఉంటె ఈమధ్య వరుసగా ప్రయివేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతుండడంతో, నిర్లక్ష్యం, సాంకేతిక లోపల కారణంగా ట్రావెల్స్ బస్సులు మృత్యు శెకటాలుగా మారాయని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
