ఇవ్వాళ్ళ భారత్ బంద్. ప్రభావం ఉంటుందా?

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో పరామిలటరీ బలగాలు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ బలగాలు అడవుల్లో సర్చ్ ఆపరేషన్లు చేపడుతూ నక్సల్స్ పై విరుచుకు పడుతున్నారు. దీంతో క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోతోంది.

Also Read : అమెరికా ఒత్తిడికి రష్యా తలొగ్గదు. ట్రంప్ కు పుతిన్ స్ట్రాంగ్ కౌంటర్

ఈ క్రమంలోనే అనేక ముఖ్య మావోయిస్టు నాయకులు తమ బలగాలతో సహా వివిధ రాష్ట్ర పోలీసుల ముందు లోగిపోతున్నారు. దీనితో 2026 మార్చ్ కల్లా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజం కానున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, చెత్తిస్ ఘడ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలోని ముఖ్య నక్సల్స్ స్థావరాలను నాశనం చేసుకుంటూ వెళ్తున్నాయి సాయుధ దళాలు.

Also Read : ఏపీలో గూగుల్ వార్.. టీడీపీకి బీజేపీ ఝలక్

ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 24) దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కొన్ని రోజుల క్రితం ఈ మేరకు లేఖ విడుదలైంది. కానీ ఇంతవరకూ ఈ బందుకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తోపాటు ఏ ఇతర పార్టీ కూడా మద్దతు తెలపలేదు. దీనితో ఈ బంద్ నామమాత్రమే కానుంది. కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాలలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవచ్చు. మొత్తం మీద క్రమంగా మావోయిస్టుల ప్రాభవం తగ్గిపోతున్న నేపథ్యంలో ఈరోజు ఈ బంద్ ప్రభావం ప్రజా జీవితంపై పెద్దగా ఉండదు.