అమెరికా పెట్టే ఆంక్షలు, వేసే శాంక్షన్లకు రష్యా తలొగ్గే సమస్యే లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు. ఏ దేశం కూడా తన ఆత్మగౌరవాన్ని వేరే దేశం కోసం తాకట్టు పెట్టదని అన్నారు. అలాగే ఏ దేశం కూడా ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోదని అన్నారు. అంతకు ముందు ట్రంప్ రష్యాకు సంబందించిన ప్రముఖ ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Also Read : WWC : వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టు
అమెరికా మాపై ఒత్తిడి తెచ్చి ఎదో సాధిద్దామని అనుకుంటోందని, కానీ అమెరికా ఆంక్షలతో రష్యా అర్ధక వ్యవస్థకు ఏమీ కాదని ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పుతిన్. యుద్ధం అగాలని నీతి కబుర్లు చెప్పే ట్రంప్, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా ఆపాలని, అప్పుడు యుద్ధం అదే ఆగిపోతుంది అని పుతిన్ అన్నారు.
Also Read : ఏపీలో సర్పంచ్, పరిషత్ ఎన్నికలపై కీలక అప్డేట్
అమెరికా ద్వారా ఉక్రెయిన్ కు చేరుకుంటున్న లాంగ్ రేంజ్ మిసైల్స్ గురించి కూడా పుతిన్ ఫైర్ అయ్యారు. 3వేల కిలోమీటర్ల సమర్జ్యం ఉన్న యూఎస్ లాంగ్ మిస్సిల్స్, తోమాహాక్ మిస్సైల్స్ ను ఉక్రెయిన్ తమపై ప్రయోగిస్తే పరియొవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని, ప్రతిస్పందన ఉహించలేని విధంగా ఉంటుందని పుతిన్ అమెరికాను హెచ్చరించారు. రష్యా యుద్ధం అపాలంటే ఆ దేశం నుండి ఆయిల్ కొనడం ఆపాలని భారత్ వంటి దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా ఆయిల్ కంపెనీలపై ఆయన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పుతిన్ అమెరికాను పైవిధంగా హెచ్చరించారు.
