ఒక వైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సంగ్దిగ్థత కోసాగుతుండగానే ఇటు ఏపీలో సర్పంచ్, పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వివరాలు తెలిపారు.
Also Read : బాలకృష్ణపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఎన్నికలను నాలుగు దశలలో నిర్వహించనున్నారు. సర్పంచులు, మునిసిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పిటీసీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటినుండీ కసరత్తు చేసి డిసెంబర్ నాటికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జనవరిలో నోటిటిఫికేషన్ విధుల చేసే అవకాశం ఉంది. అలాగే అదే నెలలో ఎన్నికలు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఇదే తరుణంలో 18 సంవత్సరాలు నిండిన వారు సంవత్సరంలో 4 సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ తీసుకు రావాలని ప్రభుత్వానికి సూచించినట్లు నీలం సాహ్ని తెలిపారు.
