తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం బీసీ రాజకీయ రిజర్వేషన్ బిల్లుకు కోర్టుల నుండి అడ్డంకులు ఎదురు కావడంతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ బీసీ సంఘాలు శనివారం *అక్టోబర్ 18) న బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బందుకు ఇప్పటికే బీఆర్ఎస్ బిజెపి పార్టీలతో పాటు మావోయిస్టు పార్టీ సైతం మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read : టీచర్లకు టెట్.. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?
ఇక ఇప్పుడు ఈ బందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా నిర్మానుష్యమవనుంది. శనివారం జరిగే బందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. ఇక రేపు, బాదుకు సంబందించిన సెలవు సమాచారాన్ని విద్యాసంస్థలు, ఇతర వ్యాపార సముదాయాలు ప్రకటించే అవకాశం ఉంది.
