భారత మహిళల జట్టు ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు చేరాలంటే?

మ్యాచులు జరుగుతున్న కొద్దీ మహిళల ప్రపంచ కప్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. దాదాపు సగం మ్యాచులు ముగిసేటప్పటికీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు చెరు ఏడు పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ తో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో నిలవగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇక నాలుగు మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లో విజయం సాధించిన సౌతాఫ్రికా మూడవ స్థానంలో ఉండగా నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించిన ఇండియా నాలుగో స్థానంలో ఉంది.

Also Read : ఇండియన్ క్రికెటర్లను అవమానించిన ఆసీస్ క్రికెటర్లు

వాస్తవానికి ఈ టోర్నమెంట్లో 8 జట్లు పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ వర్షం తొమ్మిదవ ప్లేయర్గా ఆడుతోంది. ఇప్పటివరకు మూడు కీలక మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లతో శ్రీలంక ఆడాల్సిన రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దవగా, పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ ఫలితమేటూ తేలకుండానే మధ్యలో ఆగిపోయింది. దీనితో ఇరుజట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు అంపైర్లు. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ లోని తదుపరి మ్యాచులు ఎంతో కీలకం కానున్నాయి.  కేవలం గెలవడమే కాకుండా మెరుగైన నెట్ రన్ రేట్ ను సాధించాల్సిన అవసరం కూడా ఏర్పడింది.

Also Read : రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు…

ఇక టీమిండియా విషయానికి వస్తే శ్రీలంక, పాకిస్తాన్ జట్లపై విజయం సాధించి నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లపై ఓటమిపాలై టేబుల్ లో నాలుగు స్థానానికి పరిమితమైంది. ఇక ఇప్పుడు సెమీఫైనల్ కు చేరాలంటే తదుపరి మూడు మ్యాచుల్లో విజయం సాధించాలి. అప్పుడు భారత జట్టు నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంటుంది. లేదా రెండు మ్యాచుల్లో గెలిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. ఇక ఒక్క మ్యాచులో మాత్రమే గెలిస్తే పరిస్థిఠీ ఇతర జట్ల గెలుపు ఓటములపై ఆధారపడి ఉంటుంది.

Also Read : ఓట్ చోరీపై సుప్రీంలో పిల్. ఏం జరిగిందంటే…

భారత జట్టు తన రాబోయే మూడు మ్యాచులను ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లపై ఆడనుంది. తన చివరి మ్యాచ్ అయిన బంగ్లాదేశ్ తో భారత్ ఎలాగూ విజయం సాధిస్తుందనుకుంటే ఇక మిగిలిన న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జట్లలో కనీసం ఒక్క జట్టనైనా మంచి రన్ రేట్ తో ఓడిస్తే సెమీఫైనల్ కు వెళ్లడం ఖాయం. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ మ్యాచ్ గెలవకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటికైనా బౌలింగ్ విభాగానికి పదులు పెట్టి, చివరి మూడు మ్యాచులలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్ లో అడుగు పెట్టాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు. ఇక లీగ్ స్టేజ్లో తన తదుపరి మ్యాచును భారత జట్టు ఇంగ్లాండ్ తో అక్టోబర్ 19న ఆడనుంది.