క్రికెట్ ఓ జెంటిల్ మెన్ గేమ్. ప్రపంచవ్యాప్తంగా ఆ గేమ్ కు ఓ రెస్పెక్ట్ ఉండగా క్రికెట్ ప్లేయర్లకు కోట్లల్లో అభిమానులు ఉంటారు, వారికి ఓ ప్రేత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ ఆ క్రికెట్ జెంటిల్ మ్యాన్ షిప్పును కాపాడటంలో మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పుడు ఫైల్ అవుతూనే ఉంటారు. గ్రౌండ్ లోనే కాదు బయటకూడా ఎప్పుడు కొంత వింతగానే ప్రవర్తించడం ఆసీస్ క్రికెటర్ల నైజం. మళ్ళీ అలాంటి వివాదానికే తెరలేపారు కంగారూ ప్లేయర్లు.
Also Read : రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు…
అక్టోబర్ 19 నుండి ఆసీస్ లో పర్యటించనుంది భారత జట్టు. ఈ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో మనం 3 వన్డేలు 5 టీ20 మ్యాచులు అడనున్నాం. ఈ సందర్బంగా సాధారణంగా ఈ మ్యాచులను లైవ్ టెలికాస్ట్ చేసే చానెళ్లు ప్రమోషనల్ వీడియోలు తీస్తూ ఉండటం మామూలే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని కాయో స్పోర్ట్స్ ఛానెల్ ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోనే వివాదానికి కారణమైంది.
Also Read : Pooja Hegde : అందాల పాలపుంత పూజా హెగ్డే
ఆ వీడియోలో కాయో టీవీ యాంకర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇండియా షేక్ హ్యాండ్ వివాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. “ఇండియన్స్ కి ట్రెడిషనల్ గ్రీటింగ్స్ (షేక్ హ్యాండ్) నచ్చవు. Op అది వారి బలహీనత. మనం మ్యాచ్ లో బాల్ పడకముందే వారిని ఓడించచ్చు”. అని అన్నాడు.దానికి ఆస్ట్రేలియా మెన్ మరియూ ఉమెన్ క్రికెటర్లు అయితే ఇలా చేద్దాం అంటూ కొన్ని అనుచిత సజ్ఞలు చేశారు. దీంతో ఈ వీడియో చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆ ఛానెల్ పై విరుచుకు పడ్డారు. దాంతో తెల్లబోయిన సదరు ఛానెల్ కాయో స్పోర్ట్స్ ఆ వీడియోను డిలీట్ చేసింది. అయినా ఆసీస్ క్రీకెటర్ల బుద్ధి ఎక్కడికి పోయిందని ఫ్యాన్స్ ఫయిర్ అవుతూనే ఉన్నారు. మొత్తానికి ఈ వివాదంతో ఈ టోర్నీ స్టార్ట్ అవడానికి ముందే వేడెక్కింది.
