అర్ధరాత్రి.. ట్రైన్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై దూసుకుపోతోంది. ఓ మహిళ ట్రైన్ లోని మహిళా బోగీలో ఒంటరిగా కూర్చుని ఉంది. అప్పుడే ఓ దుండగుడు అటుగా వెళ్తూ ఆ మహిళను చూసాడు. వెంటనే అతను ఆ భోగీలోకి ప్రవేశించి కత్తితో బెదిరించాడు. నాకు సాహిరించకపోతే చంపేస్తానని భయపెట్టి ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాతి స్టేషన్ లో దిగేసి వెళ్ళిపోయాడు.
Also Read : ఓట్ చోరీపై సుప్రీంలో పిల్. ఏం జరిగిందంటే…
థ్రిల్లర్ స్టోరీలా అనిపిస్తున్న ఈ ఘటన కధకాదు. దురదృష్టవశాత్తు నిజంగానే జరిగింది. అయితే ఏ ఆఫ్రికా లాంటి వెనుకపడ్డ దేశాల్లో అయివుంటుంది అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సంఘటన మన దేశంలోనే జరిగింది. అదికూడా క్రైమ్ సాధారణంగా ఎక్కువగా ఉండే ఏ బిహార్లోనో, ఉత్తర ప్రదేశ్ లోనో అనుకునేరు. కాదు మన తెలుగు రాష్ట్రాల్లో, ఎప్పుడూ మనం తిరిగే వైజాగ్ – హైదరాబాద్ రూట్లోనే జరిగిందంటే నమ్ముతారా? కానీ అదే నిజం.
Also Read : మీరు మోసగాళ్ల తరఫు లాయర్లు కదా! ఏపీ ప్రభుత్వ లయర్లపై సుప్రీం సెటైర్
వివరాల్లోకి వెళ్తే ఓ 35 ఏళ్ల మహిళ సోమవారం రాత్రి రాజమండ్రిలో సంత్రగాచి స్పెషల్ రైలులో ఎక్కారు. ప్రత్యేక రైలు కావడంతో ప్రయనికులు తక్కువగానే ఉన్నారు. దీనితో ఆమె లేడీస్ కంపార్టుమెంట్ కి వెళ్లి కూర్చున్నారు. గుంటూరు స్టేషన్లో సహచరులు దిగపోవడంతో ఆ కంపర్ట్మెంట్ లో ఆమె ఒక్కరే ఉన్నారు. ట్రైన్ గుంటూరు దాటగానే ఈ పరిస్థితిని అదనుగా తీసుకున్న ఓ ఆగంతకుడు ఆ భోగీలోకి వెళ్లి, కత్తితో బెదిరించి ఆ మహిళపై అత్యాచారం చేసాడు. అనంతరం పెదకూరపాడు స్టేషన్ లో దిగి పరారయ్యాడు. దానితో ఆ బాధితురాలు మర్నాడు ఉదయం (మంగళవారం) ట్రైన్ చర్లపల్లి స్టేషన్ చేరుకోగానే GRP పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు నిదితుడికోసం గాలిస్తున్నారు. నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఇలాంటి బిజీ రూట్లో నడిచే రైళ్లలో, అదీ లేడీస్ కంపార్ట్మెంట్ దగ్గర కూడా కనీస భద్రత లేకపోవడం ఆశ్చర్యంతో పాటు భయాన్నీ కలిగిస్తోంది.
