బీహార్ లో ఎన్నికల వాతావరణం వేడిక్కినప్పటినుబడీ ఈ ఓట్ చోరీ వివాదం కొనసాగుతూనే ఉంది. అనేక ఓట్లను ఎన్నికల కమీషన్ తీసివేసిందిని అర్హులైన వారికి ఓట్లు లేకుండా చేసి ఓట్ చోరీకి ఈసీ పాల్పడుతోందని లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలు చూపనప్పటికీ బలంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చాలా శ్రమించారు రాహుల్. ఈ నేపధ్యలో రాహుల్ జోడో యాత్రకు ప్రజల్లో మంచి స్పందన కూడా లభించిన మాట వాస్తవం.
Also Read : మీరు మోసగాళ్ల తరఫు లాయర్లు కదా! ఏపీ ప్రభుత్వ లయర్లపై సుప్రీం సెటైర్
ఇక ఎన్నికల కమీషన్ వర్షన్ వేరేలా ఉంది. కేవలం వేరే ప్రాంతాలకు మైగ్రేట్ అయిన వాళ్ళ, చనిపోయిన వాళ్ళ ఓట్లనే మేము తీసివేసామని చెప్పుకొస్తోంసి ఈసీ. చివరికి ఎన్నికల నోటిఫిసెషన్ వచ్చాక కూడా ఈ విషయంపై చర్చ మాత్రం ఆగడం లేదు. వచ్చే నవెంబర్ 6, అలాగే 11వ తేదీల్లో, రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక నవంబర్ 14న ఫలితాలను వెల్లడించనుంది ఈసీ.
Also Read : మమ్మల్ని అంతమొందించేందుకు కుట్ర చేశారు. మాజీ మంత్రి బొత్సా సంచలన కామెంట్స్
ఇక అసలు విషయానికొస్తే రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలపై విచారించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని కోరుతూ రోహిత్ పాండే అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం దీనిని కొట్టేసింది. ఈ విషయమై ఈసీని సంప్రదించాలని సూచించింది. కాగా ఈసీని సంప్రదించామనీ, అయినా సరైన సమాధానం రాకపోవడంతోనే కోర్టును ఆశ్రయించామనీ పిటీషనర్ న్యాయమూర్తికి తెలియజేసారు. అయితే ప్రత్యన్యాయ మార్గాలను చూడాలని సూచించిన ధర్మాసనం సదరు వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
