APSRTC : స్త్రీశక్తి పధకంలో బయటపడ్డ అవకతవకలు. ఇది మరొపెద్ద స్కామ్ అంటూ ఆరోపణలు

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తీ) పధకంలో అవకతవకలు వెలుగు చూశాయి. దీనితో ఉన్నతాధికారులు నలుగురు కాండక్టర్లను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే బస్సు ప్రయాణాలలో భాగంగా సాధారణంగా ఒక్కోసారి TTIలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రయనికులందరూ టికెట్లు తీసుకున్నారా లేదా అని చెక్ చేసి, టికెట్లు లేనివారికి ఫైన్లు వేస్తూ ఉంటారు.

Also Read : మమ్మల్ని అంతమొందించేందుకు కుట్ర చేశారు. మాజీ మంత్రి బొత్సా సంచలన కామెంట్స్

అలా నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన తనిఖీలలో మొగవారిదగ్గర స్త్రీసక్తి టికెట్లు దొరికాయి. దీనితో విస్తుపోవడం అధికారుల వంతైంది. మొగవారికి ఫ్రీ బస్సు సదుపాయం వర్తించదని, ఆధార్ కార్డు చూసే టికెట్ ఇవ్వాలని తెలిసిన సదరు కండక్టర్లు స్త్రీశక్తి టికెట్లు కొట్టి ఆ డబ్బులను తమ జేబులో వేసుకుంటున్నారని గమనించారు. దీనితో గుంటూరు 1 డిపోలో ఒక్కరు, గుంటూరు 2 డిపోలో ఇద్దరు, తెనాలి డిపోలో ఒక్కరు చప్పున మొత్తం నలుగురు కాండక్టర్లపై వేటు పడింది. TTIలు ఆయా డిపో మ్యానేజర్లకు సిఫార్స్ చేయగా, వారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read : ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

ఇదిలా ఉంటే మొరోవైపు ఇది కేవలం కండక్టర్ల స్థాయిలో జరుతున్న తతంగం కాదని దీనికి ఉన్నతాధికారులనుంది మంత్రి వరకు సంబంధం ఉందని, అందరికీ ముడుపులు చేరుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదో పెద్ద స్కామని, కేవలం కండక్టర్లను బలి పసువులను చేసారని,  విచారణ జరిగితే పెద్ద తలకాయలు బయటకొస్తాయని అంటున్నారు.