Nobel Prize : నోబుల్ ప్రైజ్ అనౌన్స్ చేసిన కమిటీ. ఎవరికంటే?

ప్రపంచ శాంతికి పాటుపడిన వారికి ఏటా ఇచ్చే నోబెల్ ప్రైజ్ ను నార్వేజయన్ కమిటీ అనౌన్స్ చేసింది. 2025 సంవత్సరానికి గానూ వెనిజులా మాజీ పార్లిమెంట్ సభ్యురాలు మరియా కొరీనా మాచాడో అనే మహిళకు ఈ అవార్డ్ ను ప్రకటించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసినందుకు గాను నోబెల్ కమిటీ మరియాకు నోబెల్ బహుమతిని ఇచ్చింది. ఈ అవార్డు కోసం ఎంతగానో ఎదురు చూసిన ట్రంప్ కు నిరాశే మిగిలింది.

Read Also: SSMB29 : మహేష్ బాబు రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా? అధికారిక ప్రకటన ఎప్పుడంటే?

ఇక మారియా వయస్సు 57 సంవత్సరాలు. ఆమె వెనిజులాలో పుట్టారు. ఆండ్రెస్ బెల్లో కాథలిక్ యూనివర్శిటీ నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ఇన్స్టిట్యూటో డి ఎస్టూడియోస్ సుపీరియోరెస్ డి అడ్మినిస్ట్రేషన్ నుండి ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2011 జనవరి 5 నుండి 2014 మార్చి 21 వరకు నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు. ఆమెపై 15 సంవత్సరాల పాటు పదవిని చేపట్టకుండా 2023 జూన్ 30న నిషేధం విధించబడింది. వెనెజులాలో నియంత నికోలస్ మదురో పాలన పెరుగుతున్నప్పటికీ, ఆమె ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం అవిరామంగా పోరాటం చేస్తున్నారు.