తెలంగాణ స్థానిక ఎన్నికలు ఆగడానికి కారణమైన ఆ పిటీషనర్ ఎవరో తెలుసా?

ఎంతపని చేశావురా నాయనా.. అంటూ అటు బీసీ సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు తలలు పట్టుకునేలా చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? అతను ఓ సామాన్యుడు, సామాజిక కార్యకర్త. పేరు బుట్టెంగారి మాధవరెడ్డి. రాజకీయ నాయకులకు వ్యవస్టీకృతంగా కట్టబెడుతున్న రిజర్వేషన్ల వ్యవస్థ రానురానూ సమాజాన్ని మరీ మిస్ బ్యాలెన్స్ చేస్తోందన్న ఆయన ఆందోళనే తాజాగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు కారణం.

Read Also : BIG BREAKING : స్థానిక సంస్థలు ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు. ఇక ఎన్నికలు అంతేనా?

అగ్ర వర్ణాలలోనూ అనేక మంది నిరు పేదలున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి కూడా సమన్యాయం జరగాలన్నది ఆయన బలమైన ఆకాంక్ష అని చెప్తున్నారు. ఈ క్రమంలోనే రెడ్డి జాగృతి అనే వ్యవస్థను నెలకొల్పి పోరాటం మొదలు పెట్టారు. ఈయన వేసిన పిటీషన్‌ తోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇది ఇంతటితో ఆగదని, కులాలకు, మతాలకు అతీతంగా కేవలం పేద వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉండేలా పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు.

Read Also SSMB29 : మహేష్ బాబు రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా? అధికారిక ప్రకటన ఎప్పుడంటే?

మాధవ రెడ్డి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా, మూడుచింతలపల్లి మండలం, కేశవాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. తార్నాకలోని విశ్వ చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌, అనంతరం రామంతాపూర్‌ క్రాంతి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివారు. 2006లో తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో ఆయన యాక్టివ్ గా రాస్తారోకోలు, మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మె వంటి కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పోరాటాల్లో ఆయనపై 56 కేసులు నమోదవగా, ఆరు సార్లు జైలుకు కూడా వెళ్లారు. ఇక 2016లో రెడ్డి జాగృతి సంస్థను స్థాపించి, తెలంగాణ వ్యాప్తంగా రెడ్డి సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.