ప్రధాని నరేంద్ర మోదీకి కంగ్రాట్స్ చెప్పిన జగన్. ఈ బంధం ఇంకా బలంగానే ఉందా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also : ఓ వ్యక్తి దగ్గర 1638 క్రెడిట్ కార్డులు ఉన్నాయంటే నమ్ముతారా? గిన్నీస్ రికార్డ్ సాధించిన భారతీయుడు..

ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించిన సందర్భంగా జగన్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. “ఇంత సుదీర్ఘ ప్రయాణం మీకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను, అంకితభావాన్ని, పట్టుదలను తెలిజేస్తోంది” అని ట్విట్టర్లో రసుకొచ్చారు జగన్. అటు గుజరాత్ ముఖ్య మంత్రిగా 13 ఏళ్లపాటు పనిచేసిన మోదీ, ప్రధాన మంత్రిగా 11 ఏళ్ళు పూర్తి చేసుకుని మొత్తంగా 25వ ఏట అడుగు పెట్టారు.

Read Also : ఈ రెండు రోజులు ట్రంప్ కు నిద్ర పట్టదేమో! ఏమైపోతాడో పాపం…

ఇక జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నుండి మంచి సహకారం అందిన విషయం తెలిసిందే. నిధుల విడుదలలోనూ, కరోన సమయంలో వ్యాక్సిన్ మెడికల్ అవసరాల విషయంలోనూ భారీగానే సహకరించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం.

 

ఇప్పటికీ వైసీపీ, బీజేపీ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకి బేషెరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్నీమధ్య అక్టోబర్ 27 నుండీ ఐక్య రాజ్య సమితిలో  జరగబోయే చర్చలో భాగంగా భారతదేశం తరుపున పాల్గొనే బృందంలో వైసీపీ ఎంపీ మిదున్ రెడ్డికి ప్రధాన మంత్రి చోటు కల్పించడం పెద్ద చర్చకే దారి తీసింది.. ఈ బృందంలో ఒక్క టీడీపీ ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం.