ఓ వ్యక్తి దగ్గర 1638 క్రెడిట్ కార్డులు ఉన్నాయంటే నమ్ముతారా? గిన్నీస్ రికార్డ్ సాధించిన భారతీయుడు..

గిన్నీస్ రికార్డులు చాలా మంది సాధిస్తూ ఉంటారు. ఒక్కొరు ఒక్కో అద్భుతమైన లేదా ఓ విచిత్రమైన పని చేసి గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకుంటూ ఉంటారు. అలానే ఆలోచించాడు మనదేశానికే చెందిన మనీష్ థామెజా. 1638 వ్యాలీడ్ క్రెడిట్ కార్డులతో ప్రపంచంలోనే ఎక్కువ క్రెడిట్ కార్డులున్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు.

Read Also : విజయ్ యాక్సిడెంట్ కు రష్మీక కారణమంటూ కామెంట్స్.. ఇలా ఉన్నరేందిరా అయ్యా!

ఈ మధ్య కాలంలో యువత లోన్ యాప్ లు, పర్సనల్ లోన్స్ అంటూ క్రెడిట్ స్కోర్ కోల్పోయి, ఒక్క క్రెడిట్ కూడా రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈ మనీష్ ఇన్ని వ్యాలీడ్ క్రెడిట్ కార్డులు సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో దాదాపు 90% కార్డులు తన క్రెడిట్ హిస్టరీ వల్లనే రాగా, మిగతా వాటిని రివార్డ్స్ కోసం యప్.డీల ద్వారా సొంతం చేసుకున్నాడు మనీష్.

Read Also : ARATTAI : అరట్టై సెన్సేషన్.. వాట్సాప్ కు చుక్కలు చూపిస్తున్న న్యూ ఇండియన్ యాప్

తనకు క్రెడిట్ కార్డులంటే ఇష్టమని, వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్, రివార్డులను సరిగా వాడుకుంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నాడు మనీష్ థామెజా. అలాగే కరోన సమయంలో ఈ క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగ పడ్డాయని తెలిపాడు. ఈ రికార్డే కాక 10 లక్షల కాయన్స్ కలెక్ట్ చేసిన మరో గిన్నీస్ రికార్డ్ కూడా తన పేరిట ఉండడం విశేషం.