విజయ్ యాక్సిడెంట్ కు రష్మీక కారణమంటూ కామెంట్స్.. ఇలా ఉన్నరేందిరా అయ్యా!

గత వారం రౌడీబాయ్ విజయ దేవరకొండకు, నేషనల్ క్రష్ రష్మీకకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటినుంచో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఉంది. దాన్ని నిజం చేస్తూ వీరు నిశ్చితార్థం చేసుకోవడం ఇద్దరి ఫాన్స్ నూ ఖుషీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరీలో వీరి వివాహం జరగనుంది.

Read Also : ARATTAI : అరట్టై సెన్సేషన్.. వాట్సాప్ కు చుక్కలు చూపిస్తున్న న్యూ ఇండియన్ యాప్

ఇదిలా ఉంటే ఫ్యామిలీతో కలిసి పుట్టపర్తి వెళ్లిన విజయ్ హైదరాబాద్ తిరిగి వస్తుండగా తను ప్రయాణిస్తున్న కారుకు నిన్న చిన్న యాక్సిడెంట్ అయింది. ఎవరికీ ఎలాటి గాయాలు కాలేదు. ఫ్యామిలీ అంతా సేఫ్ గా ఉన్నామని విజయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

Read Also : పహల్గామ్ దాడికి సహకరించిన వ్యక్తి అరెస్ట్.. ఒక మొబైల్ ఛార్జర్ వల్ల దొరికేశాడు

కానీ సోషల్ మీడియాలో ఈ విషయంపై పలువురు నీచ ప్రచారానికి తెరలేపారు. రష్మీకతో నిశ్చితార్థం అయిన రెండు రోజులకే యాక్సిడెంట్ అయ్యిందని, ఆమెది ఐరెన్ లెగ్ అనీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు రష్మీక అభిమానులు కౌటర్ ఇస్తూ పాజిటివ్ గా ఆలోచించాలని, ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగి ఎవరికో ఎదో కావాల్సిన పరిస్థితి నుండీ కుటుంబం బయట పడిందనీ, అలా ఎందుకు ఆలోచించకూడదనీ అంటున్నారు. మొత్తం మీద విజయ్ కారుకు యాక్సిడెంట్ అవ్వడంతో సోషల్ మీడియాలో మరోసారి నెగిటివిటీ పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయింది.