తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గోపాలరెడ్డి అనే వ్యక్తి వేసిన పిటీషన్ పై విచారించిన ధర్మాసనం, ఈ విషయంపై హైకోర్టులొనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ పెండింగ్ లో ఉండగా మావద్దకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం పిటీషనర్ ను ప్రశ్నించింది.
Read Also : BIG BREAKING : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి
హైకోర్టు స్టీ ఇవ్వడానికి నిరకరించడంతోనే ఇక్కడకు రావాల్సి వచ్చిందని పిటీషనర్ కోర్టుకు తెలియజేసారు. ఏమైనప్పటికీ హైకోర్టులో విచారణ జరుగుతుండగా మేము జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం కేసును కొట్టివేసింది. దీనితో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లు అయింది. ఇక హైకోర్టులో ఎల్లుండి ఈ అంశంపై విచారణ జరగనుంది.
