BIG BREAKING : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ పై దాడి జరిగింది. కోర్టులో వాదనలు వింటూ ఉన్న సందర్భంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.

Also Read : శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలో తెలుసా? మనం తప్పుగా చేస్తున్నాం..

చీఫ్ జస్టిస్ ఒక కేసుకు సంబందించిన వాదనలు విటుండగా, ఓ లాయర్ గవాయ్ కూర్చున్న పోడియం వద్దకు దూసుకువెళ్లి తన షూ తీసి గవాయ్ మీదకు విసిరాడు. దాన్ని అడ్డుకున్న సిబ్బంది వెంటనే అతన్ని పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. ఆ సమయంలో “సనాతన ధర్మంపై దాడి చేసేవారిని వదిలిపెట్టం” అని ఆ లాయర్ బిగ్గరగా అరిచాడు.

Read Also : BSNL ఈసిమ్ సేవలు ప్రారంభం. సిమ్ లేకుండానే కాల్స్..

అనంతరం వెంటనే తేరుకున్న గవాయ్ స్పందిస్తూ “మిగిలిన లాయర్లు వాదనలు వినిపించండి. ఇలాంటి సంఘటనలు నన్ను ప్రభావితం చేయలేవు” అనడం విశేషం. మరి ఆ లాయర్ ఎవరు, అతనిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయం తెలియాల్సి ఉంది.