Vijaya Dasami : విజయ దశమికి, జమ్మి చెట్టుకు సంబంధం ఏమిటి?

తెలుగు ప్యాలెస్ పాఠకులకు, ప్రకటన కర్తలకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు.

దేశవ్యాప్తంగా ఈరోజు విజయదశమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణ భారతదేశంలో ఈ పండుగను దుర్గాదేవి ప్రధాన్యంగా జరుపుకుంటారు. ఇక ఉత్తరావనిలో రావణ సంహారం ప్రాతిపదికగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు.

Read Also :Ariyana Glory : బ్లాక్ డ్రెస్ తో అరియానా అరాచకం!

ఈ పండుగకు ప్రతి యుగంతోను సంబంధం ఉంది. ముఖ్యంగా  మహిషాసుర మర్ధినిగా అమ్మవారు రాక్షస సంహారం చేసిన రోజుగా ఈ దసరాకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక దేవతలు పాల సముద్రాన్ని చిలుకుతుండగా అమృతభాడం బయటకొచ్చిన రోజును విజయదశమిగా చెబుతారు. అలాగే త్రేతాయుగంలో రామ చంద్రుడు రవాణ సంహారం చేసిన రోజున విజయదశమి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ద్వాపర యుగంలో సమీ వృక్షంపై ఉన్న ఆయుధాలను తీసి గోవులను కాపాడడంకోసం కౌరవులపై అర్జునాదులు విజయం సాధించిన రోజునుకూడా విజయదశమిగా భావిస్తారు.

Real Alao : ఈరోజు నుండీ ప్రారంభం కానున్న మహిళల క్రికెట్ ప్రపంచం కప్. భారత్ షడ్యూల్ ఇదే! లైవ్ ఎక్కడంటే?

అసలు విషయానికొస్తే ఈరోజు జమ్మిచెట్టును పూజిచడం అనే ప్రక్రియ ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. అసలు దసరా పండుగకు జమ్మిచెట్టును సంబంధం ఏమిటీ అని కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది. క్షీర సాగర మధనం జరిపినప్పుడు కల్ప వృక్షంతో పాటు అనేక దేవతా వృక్షాలు కూడా ఉద్భవించాయి. అలాంటి పవిత్ర వృక్షాల్లో శెమీవృక్షం (జమ్మి చెట్టు) ఒకటి. అలాంటి పవిత్రమైన వృక్షాన్ని పూజించి ఏకార్యం తలపెట్టినా సఫలం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. కౌరవులపై పాండవుల విజయ పరంపర ఇక్కడనుండే ప్రారంభమయింది. కనుక ఈరోజు ప్రతి ఆలయంలో జిమ్మిచెట్టుకు పూజచేసి అంతా శుభం జరిగి అన్నింటా అందర్నీ విజయం వరించాలని బ్రహ్మణోత్తములు ఆశీర్వాదాలు అందజేస్తూ ఉంటారు. అలాగే ఆయా వృత్తులు చేసే వారు వారి ఆయుధాలను అమ్మవారి వద్ద ఉంచి విజయం కోసం ప్రార్థిస్తూ ఉంటారు.