తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెరలేచింది. నిన్న ఎన్నికల షాడ్యూల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఎన్నికల కమీషన్. అక్టోబర్ 9న ప్రారంభం కానున్న ప్రహసనం నవంబర్ 11న తుది ఫలితాల ప్రకటనతో ముగియనుంది. MPTC, ZPTC ఎన్నికలు రెండు విడతలలో జరగనుండగా, మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు 5 దఫాలుగా జరగనున్నాయి.
Read Also : విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ఎవరికి నష్టం?
కానీ మొదటినుండి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు పురిటి నొప్పులు పడుతూనే ఉన్నాయి. రిసర్వేషన్లలో సమస్యలు, కోర్టు కేసులు ఇలా ఎన్నో తలనొప్పులు దాటుకుని మొత్తానికి నోటిఫికేషన్ వరకూ వచ్చాయి. అయినా ఇంకా ఎన్నికలకు మోక్షం రానట్టే కనిపిస్తోంది. ఇందుకు ప్రధానమైన కారణం బీసీ రిజద్వేషన్ బిల్లు. ఈ మధ్యనే ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ బిల్లు తాలూకూ ఆర్డినెన్స్ ఇటు గవర్నర్ వద్ద అటు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్ లొనే ఉంది.
Read Also : Bhagyasri Borse : భాగ్యశ్రీ బోర్సే హాట్ లుక్
ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించాలంటే 50 శాతానికి పైనుండే రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 షడ్యూలులో చేర్చాల్సిందే. ఇది కేంద్రం చేతుల్లో ఉన్న అంశం కావడంతో ఇప్పటికిప్పుడు ఇది జరుగుతుందా అనే అంశం ప్రశ్నర్ధకంగా మారింది. అటు బిల్లుపై ఏ నిర్ణయం రాకముందే జీఓ ఎలా ఇచ్చారని హైకోర్టు సైతం. సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో 8న కోర్టు ఇవ్వబోయే తీర్పు కీలకంగా మారింది.
