రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుసన దర్శకత్వంలో రూపొందుతున్న “పెద్ది” చిత్రం నుండీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఏమాత్రం హైప్ లేకుండా సైలెంట్ గా రిలీజవ్వడంతో ఫ్యాన్స్ అటు షాక్ లోనూ, ఇటు ఆనందంలోనూ ఉన్నారు. రామ్ చరణ్ మాస్ అప్పీరియన్స్ తో పోస్టర్ అయితే అద్భుతంగా ఉంది.
ఇదీ చదవండి : కరూర్ దుర్ఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? తప్పు విజయ్ దేనా? లేక ప్రభుత్వానిదా?
రామ్ చరణ్ నటించిన మొట్ట మొదటి చిత్రం చిరుత ఇదేరోజు, 28 సెప్టెంబర్ న రిలీజయింది. ఇప్పటికె ఈ చిత్రం రిలీజై సరిగ్గా 18 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది పెద్ది మూవీ యూనిట్.

ఇదీ చదవండి : ట్రంప్ సంచలన ప్రకటన. భారత కంపెనీలకు నష్టం తప్పదా?
బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుండగా, జాన్వీ కపూర్ ఈ సినిమాలో కధనాయకగా నటిస్తున్నారు. ఇండియన్ ప్రయిడ్ లెజెండరీ ఎఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండడం విశేషం. రత్నవేల్ విజువల్ వండర్ గా మనముందుకు రానున్న ఈ చిత్రం 2026 మార్చ్ 27 తరీకున రిలీజ్ కానుంది
