అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో తయారు కాని, యూఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ లేని ఫార్మా కమోయనీలు ఎగుమతి చేసే ఉత్పత్తులపై 100% టారిఫ్ లు వేస్తానని ప్రకటించారు. అక్టోబర్ ఒకటి నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. యూఎస్ లో ఫ్యాక్టరీలు కంస్తృక్షన్ దశలో ఉంటే వాటికి ఈ నిర్ణయం వర్తించదని ట్రంప్ అన్నారు.
Read Also : Rohit Sharma : 10కేజీలు తగ్గిన హిట్ మ్యాన్! వరల్డ్ కప్ కు ఫిక్స్ చేసాకే..?
అమెరికాకు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్ తొలి స్థానంలో ఉంది. ఎగుమతులు ద్వారా ఆ దేశం సుమారు $65.5 బిలియన్ల ఆదాయం ఆర్జించినట్లు 2024 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లిస్ట్ లో భారతదేశం $13.6 బిలియన్లతో 5వ స్థానంలో ఉంది. ఇక యూఎస్ కు ఎగుమతయ్యే మొత్తం ఫార్మా ఉత్పత్తుల్లో భారత్ వాటా 6% గా ఉండడం గమనార్హం.
Read Also : YS Jagan : “డిజిటల్ బుక్” తో కార్యకర్తలకు న్యాయం చేస్తాం : వైయస్ జగన్
100% శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత ఫార్మా దిగ్గజాలకు ఖచ్చితంగా ఎదురుదెబ్బే అని నిపుణులు చెవుతున్నారు. భారత ఫార్మా కంపెనీలకు యూఎస్ ఏ అతిపెద్ద మార్కెట్. అమెరికాలో వాడే 45% జెనరిక్ మెడిసిన్స్ మారియూ 15% బయో సిమిలర్ డ్రగ్స్ ఇండియా నుండే వెళ్తున్నాయ్. 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో మార్కెట్ అయ్యిన మొత్తం $27.9 బిలియన్ల ఉత్పత్తుల్లో $8.7 బిలియన్ల ఉత్పత్తులు యూయస్ కే అమ్ముడయ్యాయి. ఇండియన్ ఫార్మా కంపెనీలకు 30% నుండీ 40% లాభాలు యూఎస్ మార్కెట్ నుండే వస్తున్నాయి. సో మన ఫార్మా కంపెనీలకు ఈ నిర్ణయం ఖచ్చితంగా నష్టం చేస్తుందనే చెప్పాలి.
