Guntur : గుంటూరులో పనీపూరీపై నిషేధం

పనీపూరీ.. ఇవాళ్టి జంజీ యూత్ కు పనీపూరీ ఓ ఎమోషన్. పనీపూరీ కోసం చచ్చిపోయేంత ఇష్టమున్న యువత ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి పరిస్థితుల్లో గుంటూరు నగరంలోని యువతకు పెద్ద కష్టమే వచ్చింది. గుంటూరు నగరపాలక సంస్థ పనీపూరీ బళ్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also : YS Jagan : “డిజిటల్ బుక్” తో కార్యకర్తలకు న్యాయం చేస్తాం : వైయస్ జగన్

వివరాల్లోకి వెళ్తే గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా డయేరియా విపరీతంగా ప్రబలుతోంది. స్థానికంగా ఉన్న రెడ్ల బజార్, రామిరెడ్డి తోట, ప్రగతీ నగర్, సంగడిగుంట సహా మరో 9 ప్రాంతాల్లో ఈ డయేరియా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో అప్రమత్తమైన నగర కమీషనర్ పులి శ్రీనివాసులు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Read Also Asia Cup : ఫైనల్ చేరిన భారత్

ఈ సందర్బంగా పరిస్థితిని సమీక్షించిన అధికారులు వ్యాప్తిని అరికట్టడం కోసం నగరంలోని పానీపూరీ బళ్లపై తక్షణమే నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నగరంలో రోడ్లపై అమ్మే ఏ టిఫిన్ మరియూ తినుబండారాల బళ్లు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ గుంటూరు నగరంలో ఇదే పరిస్థితి కొనసాగనుంది.