ఈరోజు బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో కేవలం 37
బంతోల్లో 75 (6×4, 5×6) పరుగులు చేసాడు.
169 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బాంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే అల్ ఔట్ అయ్యింది.సైఫ్ హసన్ 69 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా బంగ్లా విజయం సాధించలేకపోయింది.
ఈ విజయంతో ఇండియా డైరెక్ట్ గా ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక రేపు జరగబోయే పాకిస్థాన్ బాంగ్లాదేశ్ మ్యాచులో గెలిచిన జట్టుతో 28 న భారత్ ఫైనల్ ఆడనుంది
