ఆసియా కప్ తుది అంకానికి చేరుకుంది. సూపర్ 4 లో భాగంగా అసలైన మ్యాచులు జరుగుతున్నాయి. లీగ్ స్టేజ్ లో అన్ని మ్యాచులను అన్ బీటెన్ గా ముంగించిన టీమ్ ఇండియా, సూపర్ 4 లోనూ అదే ఊపు కంటిన్యూ చేస్తోంది. 22న దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను సింగిల్ సైడెడ్ గా చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు (24-09-2025) బాంగ్లాదేశ్ తో తలపడనుంది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్ గెలిస్తే ఇక భారత జట్టు అఫీషియల్ గా ఫైనల్ కు చేరుకుంటుంది.
Read Also : BIG BREAKING : ఏపీలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ వాయిదా
ఇప్పుడు టీమ్ ఇండియా ఉన్న ఫామ్ కి విచిత్రాలేమీ జరగకపోతే బంగ్లాదేశ్ పై గెలుపు నల్లేరు మీద నడకే అవ్వనుంది. మరి ఇప్పుడు ఇండియా తో ఆసియా కప్ ఫైనల్ లో తలపడే జట్టు ఏది అనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. పాయింట్స్ టేబుల్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఫైనల్ లో సైతం మళ్ళీ పాకిస్తాన్ ఇండియానే తలపడనున్నాయని ఈజీగానే అర్ధమవుతుంది.
Read Also : IND vs PAK : రైవలరీ ఎక్కడుంది. ఇజ్జత్ తీసుకోకండి : కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్ట్రాంగ్ రిప్లే
శ్రీలంక సూపర్ 4 లో ఆడిన రెండు మ్యాచులలోను బంగ్లాదేశ్ పాకిస్తాన్ పై ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చివరన నిలిచింది. ఇక బంగ్లా జట్టు ఈరోజు భారత్ తో తలబడనుండడంతో గెలుపంత ఈజీ కాదు. సో బాంగ్లాదేశ్ రెండు మ్యాచులాడి ఒక విజయం నమోదు చేస్తుంది అని అనుకుంటే అటు పాకిస్థాన్ సైతం భారత్ పై ఓడిపోయి శ్రీలంక మీద గెలిచి ఒక విజయంతో ఉంది. అప్పుడు డిసైడింగ్ మ్యాచ్ లో పాక్, బంగ్లా జట్లు తలబడతాయి. ఆ రెండు జట్లలో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు భారత్ తో ఫైనల్ ఆడుతుంది. సో ఆ మ్యాచ్ లో బంగ్లాపై పాకిస్థాన్ గెలిచిందనుకుంటే, ఈ నెల 28న భారత్ పాక్ జట్లు ఫైనల్ లో తలబడడం దాదాపు ఖాయమే
