మళ్ళీ ఉత్తరాది – దక్షిణాది విభేదాల్ని రాజేసిన జీయస్టీ వ్యవహారం

కొన్ని రోజులుగా భారతదేశంలో ఉత్తరాది, దక్షిణాది వివాదానికి సంబందించిన వ్యాఖ్యలు తరచూ వినిపిస్తూ ఉన్నాయి. దేశ సమగ్రతకు వందశాతం నష్టం చేసి ఈ తరహా పోకడలు మంచిది కానప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం అగడంలేదు. రకరకాల సందర్భాల్లో రకరకాల రాజకీయ, రాజకీయేతర కారణాలతో ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం తరచూ ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి.

Read Also : T సుబ్బిరామిరెడ్డి కంపెనీకి రూ. 5700 కోట్ల లోన్ మాఫీ.. ఇలా కూడా చెయ్యొచ్చా?

ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీయస్టీ స్లాబులను తగ్గించిన విషయం. తెలిసిందే. అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు అందులో భాగంగా తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదమౌతోంది.

Read Also : Andhra Pradesh : ఏపీలో బీచ్ ఫెస్టివల్. ఎక్కడో తెలుసా?

అల్పాహారాలపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే సమయంలో చపాతీ, పరోటాలపై జేయస్టీని 0% శాంతంగా నిర్ణయించిన కౌన్సిల్ ఇడ్లీ మరియు దోసపై మాత్రం 5% గా  నిర్ణయించింది. దీంతో ఉత్తరాదివారు ఎక్కువగా తినే చపాతి, పరోటాలపై జీయస్టీ తీసేసిన ప్రభుత్వం దక్షిణాదివారు తినే ఇడ్లీ, దోసపై కొనసాగించాడాన్ని దక్షిణాదిపై వివక్షగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీలో ఎంమ్యల్యే రామకృష్ణ ప్రస్తావించడాన్ని బట్టే చూస్తే ఈ వివాదం ముదిరి పాకాన పడే అవాకాశాలు కనిపిస్తున్నాయి.