ఆసియా కప్ లో భాగంగా ఇండియాతో మ్యాచ్ సందర్భంగా తలెత్తిన షేక్ హ్యాండ్ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి రిఫరీ మెడకు చుట్టుకుంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని, టాస్ సమయంలోనూ ఇదే జరిగిందనీ, దీనిపై స్పందించాల్సిన రిఫరీ చోద్యం చూస్తూ భారత్ కు సపోర్ట్ చేసారని, కనుక మ్యాచ్ రిఫరీ పైక్రాప్ట్ ను ఆసియా కప్ నుండీ తొలగించాలని ఐసీసీకి విన్నవించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్
Read Also : మావోయిస్టుల సంచలన ప్రకటన. భారత హోమ్ శాఖకు లేఖ
ఈ నేపథ్యంలో నిన్న దీనిమీద విచారణ జరిపిన ఐసీసీ రిఫరీని తప్పించేది లేదని పీసీబీకి తేల్చి చెప్పింది. రిఫరీని మార్చకపోతే అసియా కప్ నుంచి వెళ్లిపోతామన్న పీసీబీ ఇప్పుడు ఎం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Dussehra Holidays : దసరా సెలవులు ఎప్పటినుండీ అంటే?
ఇదిలా ఉంటె ఇప్పుడు మరో వార్త బయటకొచ్చింది. ఆసియా కప్లో పాక్ ఆడనున్న మ్యాచులకు ఐసీసీ రిఫరీగా పైక్రాప్ట్ ను తప్పించిందని సమాచారం. యూఏఈ తో పాక్ అడబోయే మ్యాచ్ కు రిచర్డ్సన్ ను రిఫరీగా నియమించారని పీసీబీ అధికారి ఒకరు చెప్పినట్టు పీటీఐ తెలిపింది. ఒకవేళ ఇదే జరిగితే పాక్ తన పంతాన్ని కొంతవరకన్నా సాధించినట్టే భావించాలి.
