మావోయిస్టుల సంచలన ప్రకటన. భారత హోమ్ శాఖకు లేఖ

గత కాన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం మావోయిస్టులపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంగా భారత దేశంలోని అనేక నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీయఫ్ సాయుధ బలగాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. ఈ ఎన్ కౌటర్లలో చాలా మంది మావోయిస్టు ముఖ్యనేతలు అసువులు బస్తున్నారు.

Read Also : Dussehra Holidays : దసరా సెలవులు ఎప్పటినుండీ అంటే?

ఈ నేపధ్యలో మావోయిస్టులనుండీ భారత హోమ్ మంత్రి అమిత్ షాకు అఫీషియల్ గా ఓ లేఖ అందింది. సీపీఐ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఆ లేఖ అందినట్లు హోమ్ శాఖ దృవీకరించింది.

Read Also : Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

వెంటనే ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, ఈ ఎన్ కౌటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. 2026 మార్చ్ లోపు భారతదేశ గడ్డపై మొవోయిస్టులను లేకుండా చేస్తామన్న హోంమంత్రి డెడ్ లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది భారత సాయుధ బలగాలకు అతి పెద్ద విజయమని సెక్యూరిటీ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.