సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎదో ఒక వివాదంలో పాలుపంచుకుంటూ ఉంటారు. కాన్ని సార్లు తన వ్యాఖ్యలతో గొడవలు రేగితే మరికొన్ని సార్లు ఆయన సినిమాలు వివాదాలకు కారణాలు అవుతాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే మళ్ళీ పునరావృతమైంది.
Read Also : CBSC : స్టూడెంట్స్ కు షాక్ ఇచ్చిన సీబీయస్సీ బోర్డ్
రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, & ‘ధహనం’ అనే వెబ్ సిరీస్ నిర్మాతలపైన క్రిమినల్ కేసు పెట్టారు. తన అనుమతి లేకుండా, తన వృత్తిగత గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆమె ఆరోపించారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు తానే వ్యాఖ్యాతగా ఉన్నట్లు తప్పుగా చూపించడం వల్ల తన పరువుకు తీవ్ర నష్టం జరిగిందని సిన్హా పేర్కొన్నారు.
Read Also : Ritika Nayak : రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ బ్యూటీ
ఈ సిరీస్లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, దాని వల్ల తనకు మానసిక వేధింపులు, అవమానం కలిగాయని ఆమె ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈసారైన ఈ వివాదానికి ఒక ముగింపు వస్తుందా లేక ఎప్పటిలాగానే అర్జీవీకి మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టడానికి మాత్రమే పనికొస్తోందా అనేది వేచి చూడాలి.
