జెన్ జీ. ఈ పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. 1997 నుండి 2012 మధ్య పుట్టిన జనరేషన్ ను జెన్ జీ అని పిలుస్తుంటారు. అంటే ఇప్పుడు ఈ జెనెరేషన్ ప్రజలు 13 నుండీ 29 సంవత్సరాల ఏజ్ రేంజ్ లో ఉన్నారనమాట. దానర్థం ఏంటంటే ఇప్పుడీ దేశ భవిష్యత్ ను నిర్మించే బాధ్యత వారి పైనే ఉందని.
Read Also : Asia Cup : ఈరోజే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్. టీమ్ కాంబినేషన్ పై ఆసక్తి
ఈ జెన్ జీ జెనెరేషన్ నిజంగా తలుచుకుంటే ఒక దేశ భవితవ్యాన్ని అటు నుంచి ఇటు మార్చచ్చు. దీనికి నేపాలే మంచి ఉదాహరణ. ఈ రోజు నేపాల్ లో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని లీడ్ చేస్తోంది ఈ జెన్ జీ జెనరేషనే. పాలకులను రోడ్లపై ఉరికించి తరిమి కొడుతోంది కూడా వీళ్ళే. ఇప్పుడు ఈ విషయమే వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ మారుతోంది.
Read Also :కేటీఆర్ కు అర్హతలేదు సరే మరి ప్రజాస్వామ్యం ఎటుపోయింది సార్?
ఈ నేపద్యంలో అసలు ఈ జన్ జీ జెనరేషన్ సంఖ్య మన భారత దేశంలో ఎలా ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఇండియాలో ఈ జన్ జీ పాపులేషన్ 27.1 శాంతంగా ఉంది. ఇక దేశంలో ఈ జన్ జీ జెనెరేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 32.5% తో బీహార్ మొదటి స్తానంలో ఉండగా 30.8% తో కాశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది. జార్ఖండ్ 30.7% తో మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 24.8%, ఏపీలో 23.5% మంది జన్ జీ జెనెరేషన్ యూత్ ఉన్నారు. ఇండియా ఇన్ పిక్సెల్స్ సంస్థ విడుదల చేసిన ఈ గణాంకాలతో భారత దేశంలో ఉన్న యూత్ పవర్ యొక్క స్టామినా మరోసారి ప్రపంచానికి తెలిసినట్లైంది.
