ఆసియా కప్ లో భాగంగా, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. టోర్నమెంట్ ప్రారంభమై ఐదు రోజు గడిచిన ఇప్పటివరకూ సరైన మ్యాచ్ ఒక్కటీ జరగలేదు. పెద్ద జట్లు అన్ని చిన్న టీములమీద తమ సత్తా చటాయి. ఇక ఇప్పుడు ఈ ఇండియా పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ తో టోర్నమెంట్ హీటెక్కనుంది.
Read Also : India vs Pak : ఇండియా పాక్ మ్యాచ్ కు ఇంకా అమ్ముడుపోని టికెట్లు కారణం ఇదేనా?
ఇక ఇండియా తన ఫస్ట్ మ్యాచులో పసికూన యూఏయితో ఈజీ విక్టరీ కొట్టింది. ఆ విధ్వంసం ఏ రేంజ్ లో ఉందంటే, 40 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ రెండు ఇన్నింగ్సులు కలిపి కేవలం 17.3 ఓవర్లలోనే ముగిసింది. దీనితో 10.4 రన్ రేట్ తో ఇండియా టేబుల్ టాప్ లో నిలిచింది. అటు పాకిస్తాన్ సైతం ఒమాన్ పై సునాయాస విజయంతో టోర్నమెంట్ మొదలుపెట్టింది.
Read Also : రాజధానిపై వైసీపీ స్టాండ్ మార్చిందా? సజ్జల మాటల్లో ఆంతర్యం ఏంటి?
ఫస్ట్ మ్యాచులో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో పూర్తిగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఈ మ్యాచులో ఆ అవసరం రావచ్చు. బ్యాటింగ్ విభాగంలో మనకు పెద్ద సమస్యలు లేవనే చెప్పాలి. అభిషేక్ శర్మ, గిల్ నుండి మరోసారి విద్వంస ప్రారంభాన్ని ఆశించోచ్చు. తిలక్ వర్మ, సూర్యకుమార్, సంజూ శంసన్ లతో ఇండియా మిడిలార్డర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక శివమ్ దుబే, హార్దిక్ పాడ్య చివర్లో పవర్ హిట్టింగ్ చేస్తే భారత్ భారీ స్కోర్ చెయ్యడం పెద్ద కష్టమేం కాదు.
Read Also : కేటీఆర్ కు అర్హతలేదు సరే మరి ప్రజాస్వామ్యం ఎటుపోయింది సార్?
ఇక బాలింగ్ విషయంలో మాత్రం కాంబినేషన్ ఎలా ఉండబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బూమ్రాతో పాటు మరో పేసర్ ఆర్షదీప్ సింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, దుబాయ్ పిచ్ స్పిన్నుకి అనుకూలిస్తుండడంతో ఇద్దరు స్పిన్నర్లతోనే భారత్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కులదీప్, వరుణ్ చక్రవర్తి కాంబినేషన్ స్పిన్ బాధ్యతలను చేపట్టనుంది. ఇక రెండో పేసర్ భాధ్యతను అల్ రౌండర్ హార్దిక్ పాడ్య పోషింస్తాడు. శివమ్ దుబే రూపంలో మరో పేస్ బాలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో తన రోల్ ని పర్ఫెక్ట్ గా పోషిస్తుండటం ఇండియాకు పెద్ద అసెట్.
See Also : నన్ను పెళ్లి చేసుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరో: తమన్నా
అటు షాహీన్ ఆఫ్రిది నేతృత్వంలోని పాకిస్థాన్ బాలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. క్వాలిటీ ఫాస్ట్ బాలింగ్ అటాక్ పాకిస్థాన్ స్ట్రేంత్ అని చెప్పొచ్చు. కానీ బ్యాటింగ్ లొనే పాక్ కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బ్యాటర్లందరూ 150 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ తో అడుతుండటంతో భారీ స్కోరులు చెయ్యలేకపోతోంది. కానీ ఒక్కసారి ఫామ్ అందుకుంటే పాకిస్తాన్ సైతం గట్టిపోటీ ఇవ్వగలరు.
Read Also : అనుష్క దారిలో ఐశ్వర్య. అసలు ఏమౌతోంది?
మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాక్ మొదటిసారి తలపడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రికెట్ యుద్ధంలో సైతం భారతదేశం గెలిచి దేశం మీసం మెలెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. All the best Team India
జట్టు (అంచనా) : అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శంసన్, శివమ్ దుబే, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్పీఠ్ బూమ్రా
