India vs Pak : ఇండియా పాక్ మ్యాచ్ కు ఇంకా అమ్ముడుపోని టికెట్లు కారణం ఇదేనా?

సాధారణంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లో హైప్ మాములుగా ఉండదు. అందులోనూ వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి మల్టీ లేట్రల్ టోర్నమెంటుల్లో ఆడుతుంటే ఆ ఉత్సాహం మరో రేంజ్ లో ఉంటుంది. ఆన్లైన్ ప్లాట్ ఫాన్స్ లో టికెట్లు విడుదలైన కాసేపటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయ్.

Read Also : Ritu Varma Latest pics

కానీ ఆసియా కప్ లో భాగంగా రేపు (ఆదివారం) దుబాయ్ లో జరగబోయే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉంది. విడుదలయ్యి రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో టికెట్లు అమ్ముడుకాలేదు. రూ. 11వేల. టికెట్స్ కూడా అవైలబుల్ గానే ఉండడం గమనార్హం. దీనితో పరిస్థితి ఏమిటో అర్థంకాక ఆర్గనైజర్లు తలలు పట్టుకుంటున్నారట.

పరిణామాలు గమనిస్తుంటే దీనికి రెండు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆసియా కప్ ను క్రికెట్ ప్రేమికులు అంత సీరియస్ గా తీసుకోలేదు. హాంకాంగ్ ఒమెన్ వంటి చిన్న దేశాలు కూడా అడుతుండటంతో సిరీస్ ఎక్కువకాలం సాగనుంది. అసలు మ్యాచులు సూపర్ 4 వరకూ వస్తే తప్ప స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. సో ప్రస్తుతానికి ఈ టోర్నమెంట్ మీద ఇంకా అంత ఇంట్రస్ట్ క్రియేట్ కాలేదు.

Indvspak

ఇక రెండో ముఖ్య కారణం ఈ మ్యాచును భారతీయులలో చాలామంది బాయ్ కాట్ చేస్తూ ఉండటమే. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిష్టన్ మధ్య రిలేషన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాల మధ్య ఎలాటి బంధాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఈ నేపథ్యంలో “బాయ్ కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్” అంటూ సోషల్ మీడియాలో ప్రజలు పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి ఇండియా, పాకిస్థాన్ ను ఒకే గ్రూపులో వేసి, ఒక మ్యాచ్ ను అవైడ్ చేసే అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేదని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. రాజకీయాలను క్రికెట్ ను వేరుగా చూడాలన్న వాదన సైతం బలంగా వినిపిస్తున్నప్పటికీ, భావోద్వేగాలతో మమేకమైన భారతీయ సమాజంలో అది అంత ఈజీ కాదు. ఏది ఏమైనా రేపటి భారత్ పాకిస్తాన్ మ్యాచుకు మాత్రం అనుకున్నంత హైప్ రాలేదు.