ప్రధాని మోదీ మణిపుర్ పర్యటన ఖరారు

PM మోదీ ఈనెల 13 నుంచి 15 వరకు 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మిజోరం, మణిపుర్, అస్సాం, వెస్ట్ బెంగాల్‌, బిహార్‌లో 3 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొత్తం రూ.71,850 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బిహార్‌లో మఖానా బోర్డు లాంచ్ చేస్తారు. బిహార్‌లో రూ.36,000 కోట్లు, మిజోరంలో రూ.9,000 కోట్లు, మణిపుర్‌లో రూ.8,500 కోట్లు, అస్సాంలో రూ.18,350 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.