తెలంగాణలో పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు
