కర్ణాటకలో మరోసారి కుల గణన: సిద్దరామయ్య

కర్ణాటకలో మరోసారి కుల గణన చేయాల్సిన అవసరం ఉందని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ‘సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా మరోసారి సర్వే నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ గణన జరుగుతుంది. 2015లో నిర్వహించిన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఆమోదించలేదు. పదేళ్లు గడిచిపోయాయి. తాజాగా మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన సామాజిక న్యాయం దక్కాలి’ అని తెలిపారు.